Haryana Elections: 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానాలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కాంగ్రెస్‌కి ఘోర పరాభవం తప్పలేదు. ఇదిలా ఉంటే హర్యానా ఫలితాల అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 51కి చేరింది.
Savitri Jindal: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు.