విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నిస్తోందని తెలిపారు. నా బీసీ కులాలు అనే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నామన్నారు.…
అవినీతిలో కురుకుపోయిన పార్టీ వైసీపీ... అవినీతి పార్టీలతో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు.. అయినా.. పొత్తుల అంశం కేంద్రం పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు సత్యకుమార్.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు పదోన్నతి లభించింది. పాలనా యంత్రాంగం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించింది. ఈ విషయమై జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు ఫోన్ చేశారు. 'మీ పదవీకాలం ముగిసింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీరు రాజీనామా చేయండి' అని నడ్డా తనకు సూచించినట్లు వీర్రాజు స్వయంగా తెలిపారు.
Somu Veerraju: బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి వ్యవహారం కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడినా యన.. 1200 రోజుల రైతుల ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మద్దతు తెలిపి వస్తున్న సందర్భంలో ప్లాన్ ప్రకారం దాడి చేశారని మండిపడ్డారు.. కారు అద్దాలు ధ్వంసం చేశారు.. ఆయనపై దాడికి పాల్పడ్డారు.. ఆయనతో ఉన్న సురేష్, యాదవ్ అనే వ్యక్తులపై…
Satya Kumar: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.. ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు…
SatyaKumar: ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అయినా తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సత్యకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న…
Satyakumar: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దసరా పండగ సందర్భంగా జాతీయ పార్టీపై ప్రకటన చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ నేతలు తమకు టచ్‌లోనే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో కేసీఆర్ నేరుగా మాట్లాడారని లీకులు ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందించారు. ఏపీలో ఒక్క బీజేపీ కార్యకర్తను అయినా కేసీఆర్…