తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చిలి శశికళ మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్నారనే చర్చ సాగుతోంది.. ఇవాళ చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్ సమాధుల దగ్గర నివాళులర్పించిన శశికళ.. జయ స్మారకం వద్ద భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఇక, అన్నా డీఎంకే జెండాను మాత్రం వదలడంలేదు శశికళ.. గతంలో ఆమె జైలు నుంచి విడుదలై.. తమిళనాడుకు వస్తున్న సమయంలోనూ జయలలిత ఫొటోలు, అన్నా డీఎంకే జెండాలతో ఆమెకు స్వాగతం లభించింది..…
తమిళనాడులో చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. జైలునుంచి రిలీజ్ అయ్యాక అన్నాడీఎంకేలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అనుకూల వర్గం కూడా ఆమెకు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలే తమిళనాడు…
తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి తరువాత, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని, అభివృద్దికి డిఎంకే ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే, అన్నాడిఎంకే పార్టీ ఓటమిపై మాజీనేత శశికళ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చిన సమయంలో విజయం కోసం కలిసి పనిచేద్దామని చెప్పానని, కానీ, పార్టీనేతలు పట్టించుకోలేదని, కలిపి పనిచేసి ఉంటే అమ్మ ప్రభుత్వం అధికారంలోనే ఉండేదని అన్నారు. Read: కమల్…
తమిళనాడు రాజకీయాల్లో శశికళ ఎప్పుడు చక్రం తిప్పుదామని ప్రయత్నాలు చేసినా.. ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. జయలలిత నిచ్చెళిగా గుర్తింపు పొందిన ఆమె.. జయ కన్నుమూసిన తర్వాత.. అన్నా డీఎంకేలో కీలక బాధ్యతలు చేపట్టారు.. క్రమంగా సీఎం చైర్ ఎక్కాలని ప్రయత్నాలు చేసినా.. కేసుల్లో ఇరుక్కుపోయి జైలుపాలయ్యారు.. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడుదలైన ఆమెకు తమిళనాడులో భారీ స్వాగతమే లభించింది.. తన కారులో జయలలిత ఫొటో పెట్టుకుని దర్శనమిచ్చారు. ఎన్నికల ముందు…