వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తమిళ పాలిటిక్స్‌లో నెచ్చెలి శశికళ యాక్టివ్ అయ్యారు. చిన్నమ్మ సరికొత్త రాజకీయ ఆట షురూ చేశారు.
Tamil Nadu Sasikala : తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలో మళ్లీ చేరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలోకి తన పునరాగమనం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోర పరాజయం పాలవుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. 2026 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచి అమ్మ పాలనకు నాంది పలుకుతామన్నారు. ప్రతిపక్ష నేతగా కె. పళని స్వామి అడగాల్సిన ప్రశ్నలను ప్రస్తుత ప్రభుత్వాన్ని అడగడం…
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ "విఐపి ట్రీట్‌మెంట్" ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు జయలలిత తర్వాత చక్రం తిప్పిన నేత శశికళ. ఇప్పుడామె పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జయలలిత మరణం తర్వాత రాజకీయాల్లో దూసుకుపోవాలని భావించిన ఆమె ఆశలు తీరలేదు. పైగా కేసులతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చిన శశికళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని, అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించినా ఆ విషయంలో విఫలమయ్యారు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం పడకపోవడంతో ఆమె కీలక నిర్ణయం…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శశికళ భేటీ అయ్యారు. రజనీకాంత్ తో ఆయన భార్య లత కూడా వున్నారు. రజనీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఐడీఎంకె లో పార్టీ పదవుల పంపకం వేళ రజనీకాంత్ తో భేటీ అయ్యారు శశికళ. రెండు రోజుల క్రితం పార్టీ కోఆర్డినేటర్ పదవికోసం నామినేషన్ దాఖలు చేశారు ఈపీఎస్, ఓపిఎస్. ఏకగ్రీవంగా ఎన్నికలకు వీరిమధ్య సయోధ్య కుదిరింది. పార్టీ బాధ్యతలు ఓపిఎస్ కు ఇచ్చేందుకు ఈపీఎస్ అంగీకరించారు. ఈనేపథ్యంలో రజనీకాంత్‌తో…
దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ముసలం మొదలైంది. అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరు ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారగా సొంతపార్టీకి శాపంగా మారింది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలుగా విడిపోవడంతో కిందటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలైంది. డీఎంకే అధికారంలోకి రావడానికి అన్నాడీఎంకేలోని లుకలుకలే ప్రధాన కారణమని ఆపార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకేను తాను దారిలో పెడుతానని ‘చిన్నమ్మ’ ప్రకటించుకోవడం విశేషం. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమాలను…
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే 50 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నమ్మ శశికళ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అటు మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, పళనీ స్వామి పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని నడిపించాలని చూస్తున్నారు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ ఇప్పుడు మరలా రాజకీయాల్లో రాణించేందుకు…
అన్నాడీఎంకే పార్టీ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే నేతలు పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్ సమాథిని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధిని కూడా సందర్శించిన నివాళులు అర్పిస్తున్నాయి. అయితే, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కూడా జయలలిత, ఎంజీఆర్ సమాధులను సందర్శించిన నివాళులు అర్పించారు. అనంతరం అమె కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఐక్యంగా కలిసికట్టుగా ఉంటేనే అధికారంలోకి వస్తామని, విడిపోతే ప్రత్యర్థులు బలపడతారని, కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం…
రేపటికి, అంటే అక్టోబర్ 17కి ఆలిండియా అన్నా డీఎంకే- AIADMK ఆవిర్భవించి 50 ఏళ్లవుతుంది. దానికి ఒక రోజు ముందు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు ఆమె నెచ్చెలి శశికళ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గరున్న జయలలిత, ఎంజీఆర్ సమాధులపై పూల మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఐతే, జయ సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టటం అందరి దృష్టిని ఆకర్శించింది. అలాగే ఆమె అక్కడకు వచ్చిన కారుపై అన్నాడీఎంకే జెండా…