దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేయాలన్నది జక్కన్న ఆలోచన. అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. అయితే మహేష్ బాబుతో…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దుబాయ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే “సర్కారు వారి పాట” కోసం మేకర్స్ ఫారిన్ లో లొకేషన్లు కూడా…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సినిమాకు మాత్రమే సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను లాంచ్ చేశారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్‌నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమా లొకేషన్‌లోకి నిన్న ఒక ప్రత్యేక అతిథి విచ్చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్, మహేష్ బాబు బావమరిది జయదేవ్ గల్లాతో కలిసి “సర్కారు వారి పాట” షూటింగ్ సెట్లో మహేష్ ను కలిశారు. శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్నారు. జయదేవ్ పార్లమెంటులో గుంటూరు లోక్ సభ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా మహానటి కీర్తి సురేష్నటిస్తోంది. అయితే 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమా సెట్ లో మహేష్ బాబు ను కలిశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆ సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ కూడా అక్కడే…
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో పూజా హేగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కె.జి.ఎఫ్ 2 లో అధీరాగా నటిస్తున్న సంజయ్ దత్ మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తాడట. Read…
ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులకు నెలవైంది. ఏ హీరో బర్త్ డే జరిగినా… ఏదైనా ఈవెంట్ జరిగినా ఆ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ను ఎంత…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో “టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్” మూవీగా మోత మోగించింది. 2021 జనవరి 1 నుంచి జూన్ 30 మధ్యలో ఇండియాలో సినిమాలకు సంబంధించి “మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్”లకు సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ముందంజలో ఉన్నారు. తమిళ సినిమాలు అజిత్ “వాలిమై” ఇందులో…
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం…
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం…