ఫారిన్ లో “సర్కారు వారి పాట”కు టీమ్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దుబాయ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే “సర్కారు వారి పాట” కోసం మేకర్స్ ఫారిన్ లో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారట.
Read Also : బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు : నాని
Also Read
ఇటీవల మహేష్ గోవా షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. చిన్న విరామం తర్వాత హైదరాబాద్ షెడ్యూల్‌ను ప్రారంభించాడు. హైదరాబాద్ శరవేగంగా జరుగుతున్న షెడ్యూల్ సెప్టెంబర్ చివరి నాటికి కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అక్టోబర్ రెండవ వారంలో యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అక్టోబర్ చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ షెడ్యూల్‌లో దర్శకుడు పరశురామ్ కొన్ని పాటలతో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!