ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు లైన్లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ లిస్టులో జాయిన్ అయింది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా రూపొందుతోంది. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్యతో పాటు సంయుక్త హీరోయిన్లుగా…
సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సినిమాల తర్వాత ఆయనకు డిమాండ్ రెట్టింపు అయింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్త ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్…
మాస్ మహారాజా రవితేజ తన 76వ చిత్రం ‘RT 76’తో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 5, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. రవితేజ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో కూడిన హై-ఎనర్జీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించారు. సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ రామారావు ఆన్…
నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అనే సినిమా తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించింది, బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు చాలా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ, తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్…