టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుంచి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా?. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. కొత్త ఏడాదిలో ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి 9న రిలీజయ్యే రాజా సాబ్‌తో ఆడియన్స్‌కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురి కెరీర్స్‌కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్.
ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈ సారి పండుగకు బాస్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ను కలిపి తెస్తున్నాడు. దాంతో బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చిరుకు జోడీగా నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా.. అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో కానీ ఫస్ట్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్లో సందడి చేసి.. సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. అలాగే కేథరిన్ థెరిస్సా కూడా మూవీకి అదనపు ఆకర్షణ కాబోతోంది.
Also Read: Pawan Kalyan: 45 రోజులు అని చెప్పాం.. 35 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపాం!
రొటిన్ మాస్ చిత్రాలతో ఫ్లాప్స్ చవిచూస్తున్న రవితేజ.. ఈ సారి రూట్ మార్చి సంక్రాంతికి ఫక్తు ఫ్యామిలీ కాన్సెప్టుతో రాబోతున్నాడు. రవితేజ హైపర్‌కు గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్‌లో కనిపించినా.. ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి హీరోయిన్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండనే చెప్పాలి. ఏ హీరోయిన్ గెలుస్తుందో చూడాలి.