ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలుసు.. ఈ పండగను పేద, ధనిక అని తేడా లేకుండా వారికి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు.. ఈ సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు.. వీటిలో…
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతుంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
Heavy Traffic: ఉభయ తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ఉపాధి నిమిత్తం సొంత ఊరు వదిలి వెళ్లేవారు, ఎక్కడో ఉంటున్న వారు సంక్రాంతి పండుగకే సొంత ఊరు చేరుకుంటారు.
సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది.
తెలంగాణ సర్కార్ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.