సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త అందించింది. పండుగ సందర్బంగా.. ట్రావెల్ చార్జీలు విపరీతంగా పెరిగి.. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ నేపథ్యంలో.. వాటన్నింటిని అడ్డుకట్ట వేసేందుకు పెట్టుకుని ప్రయాణికులను లెక్కించేందుకు ఆర్టీసీ బస్సు ప్రయత్నిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి…