సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు.
Harish Rao: తెలంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు సర్టిఫికెట్లు అందజేశారు. సంగారెడ్డి జిల్లా లో 86% ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఏఎన్ఎం,ఆశా వర్కర్లను అభినందించారు. దిగ్వాల్ లో ఈ ఇళ్లను చూస్తుంటే హైదరాబాద్ లో…
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఆగివున్న బస్సును గోవా నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇస్నాపూర్ ఎస్బిఐ బ్యాంక్ దగ్గర ఘటన జరిగింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సాయిపవన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వచ్చిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు.
సంగారెడ్డి జిల్లా ఝారసంఘం మండలం మాచనూరు గ్రామంలో భూ వివాదం తారాస్థాయికి చేరింది. భూమి కోసం బయటి నుంచి కిరాయి వ్యక్తులను తెప్పించి స్వరాజ్ అనే రైతు, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.
ఆ జిల్లాలు వేరు, రెవెన్యూ డివిజన్లు వేరు, మండలాలు కూడా వేరు, ఆ రెండు గ్రామాల మధ్య విస్తరించి. ఒకే ఒక్క చెరువు, చేపలు పట్టే హక్కు మాత్రం ఒకే ఊరి మత్స్యకారులకు సొంతం. కాగా.. కళ్ల ఎదుట కళకళలాడుతున్న చెరువు, చెంగున దుంకుతున్న చేపలు కనిపిస్తున్నా ఆదాయం దక్కకపోవడంతో ఒక ఊరి బెస్తలు ఉసూరు మంటున్నారు. ఈ నేపథ్యంలో.. చెరువు రెండు పంచాయతీల పరిధిలో విస్తరించినా చేపలు పట్టే హక్కు ఒకే గ్రామం వారికి ఉండడం…
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీద ఉన్నారు. ఈ మేరకు వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల జనగామ, యాదాద్రి జిల్లాలలో పర్యటించిన కేసీఆర్.. ఈరోజు సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండు ఎత్తి పోతల పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర అనే రెండు ప్రాజెక్టు నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో నారాయణ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్‌తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాల ప్రజలకు…
సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను…
తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ విద్యుత్ నగర్‌లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది… భార్య, భర్త ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ లో చంద్రకాంత రావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు…