Falls Into Pond: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరకు వచ్చిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. బట్టలు ఉతికి ఆటోలో పంపి నడుచుకుంటూ వెళ్తుండగా కాలు జారీ పడ్డ కూతురు లావణ్య చెరువులో పడగా.. లావణ్య కోసం వెళ్లిన తల్లి యాదమ్మ కూడా చెరువులో గల్లంతైంది.
Thiefs Wandering: బాబోయ్ దొంగలు.. తాళాలు పగులగొట్టి దొంగతనాలు
ఈ ఘటనలో కూతురి లావణ్య(15) మృతదేహం లభ్యం అయింది. అటు తల్లీ యాదమ్మ కోసం గాలింపు కోసం వెళ్లిన వ్యక్తి కూడా గల్లంతు అయ్యాడు. గల్లంతైన వ్యక్తి యాదమ్మ అన్న ఉసురయ్య అని తెలిసింది. దీంతో ఘటనాస్థలంలో వారి ఇద్దరి కోసం గాలిస్తున్నారు గ్రామస్థులు. గాలింపు కోసం వెళ్లిన వ్యక్తి కూడా మరణించి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.