సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత హీరో అల్లు అర్జున్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హస్పిటల్ ఖర్చులు హీరో అల్లు అర్జున్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నట్టు సమాచారం. దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించి అప్పటి నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో కూడా…
Sandhya Theatre: పుష్ప-2 ప్రీమియర్ (డిసెంబర్ 04) సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడి, 12 రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటనలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇందులో కేసులు నమోదు అవడం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్,…
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..
నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అల్లు అర్జున్.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ…
అల్లు అర్జున్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్ గూడ జైలులోని రిసెప్షన్ లోనే ఉన్నారు. కానీ, బెయిల్ పత్రాలు ఆలస్యం రావడంతో ఆయనను మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ సందర్భంగా జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నెంబర్ ను కేటాయించారు.
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసుకున్నారు.. సినిమా వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.. ప్రేక్షకులతోపాటు సినిమాలో…
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ తీసుకురావడంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వలెనే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు…
ఈరోజు మొత్తం ‘పుష్ప’రాజ్ దే… ఎక్కడ చూసినా ‘పుష్ప’ గురించే టాక్ నడుస్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ప్రచారం జరగడంతో అక్కడికి…