లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను పోలీసులు ఆదివారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారని మంత్రి తరపు న్యాయవాది డి.సబర్వాల్ సోమవారం తెలిపారు. ఆయన రెండు ఫోన్‌లోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళా కోచ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం పేర్కొన్నారు.
శుక్రవారం జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
Haryana Sports Minister Sandeep Singh booked for harassment: హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మహిళా జూనియర్ కోచ్ పోలీసులకు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ పోలీసులు శనివారం సందీప్ సింగ్ పై వేధింపులు, అక్రమంగా నిర్భందించడం, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అయిన సిందీప్…
హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తామని చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గురువారం ఈ ఆరోపణ చేయగా, ఒక రోజు తర్వాత ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది.
అటల్ బిహారీ వాజపేయి నిష్కళంక దేశభక్తుడే కాదు… ప్రధానిగా దేశానికి సేవ చేసిన గొప్ప రాజకీయనాయకులు. 1924 డిసెంబర్ 24న గ్వాలియర్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. యుక్తవయసులో ఆర్యసమాజ్ లో చేరిన వాజపేయి ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రభావానికి లోనై ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయునిగా విశేష సేవలు అందించిన ఆయన ఆ తర్వాత భారతీయ జనసంఘ్, బీజేపీ పార్టీలలో అతున్నత పదవులను అధిష్టించారు.…
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం హిందీ, మరాఠీ భాషల్లో ‘బాల శివాజీ’ పేరు భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఆనంద్ పండిట్, రవి జాదవ్, సందీప్ సింగ్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. ‘బాల్ గాంధర్వ, నటరంగ్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మరాఠీ చిత్రాలను రూపొందించిన రవి జాదవ్ ‘బాల శివాజీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. శివాజీ నిజ జీవిత ఘటనలను వెండితెరపైకి…