తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం 6 గంటలకి కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్లతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం ఇవ్వనున్నారు. మేడారంలో అభివృద్ధి చేసిన జంక్షన్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 7:45 నిమిషాలకి హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్…