Sambhal mosque: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో హింస చెలరేగింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లి మూక దాడులకు పాల్పడింది. ఈ అల్లర్లలో దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నలుగురు మరణించారు, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఈ అల్లర్లకు సంబంధించి, యూపీ పోలీసులు ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు.
Sambhal Jama Masjid: రంజాన్ పండగకు ముందు అలహాబాద్ హైకోర్టు సంభాల్ జామా మసీదు విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ శుక్రవారం ఉత్తర్వుల్లో ఆదేశించారు. అయితే, మసీదును తెల్లగా మార్చేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. రంజాన్ పండగ సందర్భంగా మసీదును తెల్లగా తుడిచి శుభ్రం చేయాలని అనుమతి కోరుతూ జామా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు…
Sambhal Mosque: గతేడాది నవంబర్‌లో ఘర్షణకు కేరాఫ్‌గా మారిన ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాష్ ‘‘షాహీ జామా మసీదు’’ మరోసారి వార్తల్లో నిలిచింది. రంజాన్‌కి ముందు మసీదుని పునరుద్ధరించడానికి జామా మసీదు యాజమాన్యం ఏఎస్ఐ అనుమతిని కోరింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, సంభాల్ జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదులో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.
Asaduddin Owaisi: గత నెలలో ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లోని షాహీ జామా మసీదు వివాదంపై హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన అధికారుల బృందంపై ఓ వర్గం రాళ్లుతో దాడి చేసింది. స్థానికంగా ఉన్న ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. రాళ్ల దాడిలో 20కి మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.
Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Sambhal Violence: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనలకు ముందు ఈరోజు (డిసెంబర్ 6) సంభాల్‌లో డీఐజీ రేంజ్ అధికారి ఆధ్వర్యంలో ఎస్పీ సహా ఇతర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి, భారత్‌లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.
Sambhal Jama Masjid: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ సంభాల్ నగరంలో జామా మసీదు అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇళ్లను ధ్వంసం చేశారు.ఈ హింసాత్మక ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు.