స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత నిన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇన్నాళ్లూ స్పందించని సమంత, చై ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ బయట పెట్టారు. అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. బాలీవుడ్ ‘విడాకుల నిపుణుడు’ అమీర్ ఖాన్‌తో కలిసి రావడం వల్ల చైతన్య విడాకులు జరిగాయని కంగనా చెప్పుకొచ్చింది. ఈ మొత్తం విషయంపై కంగనా సుదీర్ఘమైన పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. విడాకులు ఎప్పుడు జరిగినా అది పురుషుడి తప్పు అని కంగనా ఒక ఇన్‌స్టాగ్రామ్ కథలో రాసుకొచ్చింది. దీనిని చెప్పడం మీకు సంప్రదాయవాదంగా లేదా తీర్పునిచ్చేదిగా అనిపించవచ్చు. కానీ దేవుడు పురుషులను ఎలా సృష్టించాడో స్త్రీని కూడా అలాగే సృష్టించాడు. మహిళలను బట్టల్లా మార్చుకుని, వారిని మీ బెస్ట్ ఫ్రెండ్ అని పిలిచే వారిపై జాలి చూపడం ఆపండి. వందలో ఒక మహిళ తప్పు కావచ్చు, కానీ పూర్తిగా కాదు. విడాకుల సంస్కృతి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది. ఈ ఆకతాయిలు అభిమానుల నుండి ప్రశంసలు అందుకోవడం సిగ్గుచేటు అని కూడా ఈ నటి పేర్కొన్నారు. అయితే రిలేషన్ లో ఉన్నప్పుడు మహిళ గురించే ఎప్పుడూ తీర్పులు చెబుతారని ఆమె అన్నారు.
Read Also : ‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?
ఇక ఇటీవలే కంగనా నటించిన ‘తలైవి’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమాకు అంతగా స్పందన రాలేదు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా ‘తలైవి’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ‘తలైవి’ రెండవ భాగం షూటింగ్ ను మొదలు పెట్టారు మేకర్స్. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.