“మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చల తర్వాత మా స్వంత మార్గాలు కొనసాగించడానికి చై, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక దశాబ్దం పాటు స్నేహంగా ఉండటం అదృష్టం. మా మధ్య ఎప్పటికీ ఒక ప్రత్యేక బంధం ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు సపోర్ట్ చేయాలని, మేము లైఫ్ లో ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను ఇవ్వమని మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు”… ఈ పోస్ట్ తోనే సమంత గత శనివారం అందరికీ షాక్ ఇచ్చింది. సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి వాళ్ళ విడాకులకు ఇదే కారణం అంటూ పలు విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ స్టైలిస్ట్ ఒక పోస్ట్ చేయడం, దానిని వెంటనే డిలీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
Read Also : అఫిషియల్ : “ప్రభాస్ 25” టైటిల్ అనౌన్స్మెంట్
సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ సోషల్ మీడియాలో “కొంతమంది మగవాళ్ళు తమ నిజ స్వరూపాన్ని ఇళ్లలో దాచేస్తారు. మహిళలపై హింసకు వారే బాధ్యులు. హింస అనేది ఇప్పుడు మానసిక వేధింపులు, విమర్శల రూపంలో ఉంది” అని రాసిన పోస్ట్‌ను ప్రీతం జుకల్కర్ వెంటనే తొలగించారు. ప్రీతం ఈ పోస్ట్‌లో ఎక్కడా అక్కినేని కుటుంబానికి చెందిన ఎవరినీ ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ నెటిజన్లు ఇది సమంత, చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్య అని భావిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అతను అసలు ఆ పోస్ట్ ను ఎందుకు చేశాడు? ఎందుకు డిలీట్ చేశాడు?