సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్ నడుస్తున్న కాలంలో తారలు మరింతగా ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు, లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కు, స్టార్స్ కు మరింత కమ్యూనికేషన్ ఏర్పడుతోంది. ఒకప్పుడు తరాల సినిమా రికార్డ్స్ మాత్రమే మాట్లాడుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు సోషల్ మీడియా రికార్డ్స్, లైక్స్, ఫాలోయర్స్ గూర్చి మాట్లాడుతున్నారు. ఇక తారలు కూడా ఫ్యాన్స్ రియాక్షన్స్ ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడాకుల ముచ్చట ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. ఫ్యాన్స్ నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటే ఎవరు నమ్మలేకపొతున్నారు. చూడ్డానికి మంచి ఫెయిర్, పబ్లిక్ లోను ఇద్దరు ప్రేమను వ్యక్తం చేసిన తీరును చూసి.. వీరికి విడాకులు అంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. నిన్న వీరిద్దరూ విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ పోస్టులకు రెస్పాన్స్ వస్తున్న తీరుతో ఫ్యాన్స్ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారనేది కాస్త అయోమయంగా వుంది.
సామ్, చై విడాకుల ముచ్చటను ఇద్దరు కలిసే వారు వారి సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఇది షాకింగ్ నిర్ణయం కావడంతో ఒక్కసారిగా భారీ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇక సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు అయితే 15 లక్షల లైకులు రావడం అర్థంకాకుండా వుంది. వీరిద్దరూ విడిపోవడాన్ని ఫ్యాన్స్ ఇంతలా లైక్స్ చేస్తున్నారా..? ఆమె నిర్ణయాన్ని సమర్దించారా..? లేదా ఫ్యాన్స్ కాబట్టి ఏం పెట్టినా లైక్ కొడుతాం కాబట్టి.. దీనికి కూడా లైక్ కొట్టారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక కొందరు సినీ సెలెబ్రిటీలు కూడా వీరి విడాకుల విషయమై భిన్నంగా స్పందిస్తుండటంతో ఈ టాపిక్ ఇప్పట్లో చల్లబడే అవకాశం కనిపించడం లేదు.
A post shared by Samantha (@samantharuthprabhuoffl)