ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది.. ఆదిలోనే అధికార బీజేపీకి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజకీయ వలసలకు తెరలేపారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. దీంతో షాక్ తిన్న కమల దళం.. తేరుకుని.. అఖిలేష్ ఫ్యామిలీ నుంచి వలసలను ప్రోత్సహించింది.. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి ఇద్దరికి బీజేపీ కండువా కప్పింది.. ఈ వ్యవహారంపై స్పందించిన అఖిలేష్ యాదవ్.. మొదటగా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.. తమ కుటుంబ సభ్యుల్ని చేర్చుకున్నందుకు బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన ఆయన.. కుటుంబ పార్టీలని తమను విమర్శించే వారు ఆ మరకల్ని తుడిపేస్తున్నారని పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూ సమయంలో ఒక వైపేమో బీజేపీ నేతలు ఎస్పీవైపుకు వస్తుంటే మరోవైపేమో ములాయం కుటుంబ సభ్యులు ఎస్పీ నుంచి బీజేపీ వైపునకు వెళ్తున్నారని ప్రస్తావించిన మీడియా ప్రతినిధి.. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ్‌వాదీ పార్టీలో ఆయారాం.. గయారాం రాజకీయాలు ఎక్కువ అయ్యాయి.. వాటిని మీరెలా మేనేజ్ చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.. దానికి సమాధానమిస్తూ.. ముందుగా భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు.. ఎందుకంటే మమ్మల్ని వారస్తత్వ రాజకీయ నాయకులని, మా పార్టీని వారసత్వ రాజకీయ పార్టీయని విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు వారసత్వమే లేకుండా మా నేత్ని బీజేపీలో చేర్చుకుంటున్నారంటూ తనదైన శైలిలో పంచ్‌లు వేసిన అఖిలేష్.. దీంతో.. మా వారసత్వాన్ని అంతం చేస్తున్నారని పేర్కొన్నారు.. అపర్ణను బీజేపీలోకి తీసుకొని మంచి పని చేశారు. నిజానికి సమాజ్‌వాదీ పార్టీ ఆలోచనా విధానం ఇప్పుడు మరింత బలపడిందిని చెప్పుకొచ్చారు అఖిలేష్ యాదవ్.