ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు అధికారపార్టీ వైసీపీ విజయఢంకా మోగించింది. రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ, 8 మున్సిపాలిటీలు.. 53 జడ్పీటీసీ, 53 ఎంపీపీ అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇవి కాకుండా ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరెన్నో కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కర్నూలు నగరంలో బలమైన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ సామాజిక న్యాయభేరి పేరిట చేపట్టిన బస్సుయాత్రను లైట్ తీసుకున్నారు.…
శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయ యాత్రలు ప్రారంభిస్తే తిరుగే ఉండదని భావిస్తాయి పొలిటికల్ పార్టీలు. తాజాగా వైసీపీ తమ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా అదేకోవలోకి వస్తుంది. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారే. అధికారపార్టీ కూడా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించడంతో.. అంతే అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో సిక్కోలు వైసీపీ నేతలు బాధ్యతలు తీసుకుంటారని లెక్కలేసుకున్నాయి పార్టీ వర్గాలు. అంతర్గత…
వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్ర ప్రారంభించనున్నారు మంత్రుల. ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. 10.00 గంటలకు నారాయణపురం.. 10.45 కు ఏలూరు బైపాస్ మీదుగా 11.30 కి గన్నవరం చేరుకుంటుంది. 12.15కు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి వరకు యాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 1.30కి ఆచార్య…
ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం…
ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు…
వైసీపీ మంత్రులు ప్రారంభించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రం రెండోరోజుకు చేరుకుంది. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు విశాఖ, తూ.గో. జిల్లాలలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. లంకాలపాలెం జంక్షన్, అనకాపల్లి బైపాస్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై రోడ్డు జంక్షన్, నక్కపల్లి, తుని, అన్నవరం, జగ్గంపేట మీదుగా ఈ…
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీపై చంద్రబాబు అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని. . ప్రజలంతా క్విట్ చంద్రబాబు, క్విట్ తెలుగు దేశం అంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ జవసత్వాలు అయిపోయాయని ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో తనది అనుకున్న ఒక్క కార్యక్రమమైనా ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉంటే…