భారత్ చేతిలో దాయాది పాకిస్థాన్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 25 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో…