ముందస్తు ఎన్నికలు అన్నది మీడియా చేస్తున్న హడావిడి, కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదన్నారు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం.. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు పాలన ఉంటుందని తేల్చేశారు.
పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.
చంద్రబాబు, లోకేష్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.