తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వై.యస్.రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు నిర్వహించారు. సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారన్నారు. ఇలాంటి కలయిక ప్రపంచం లోనే అరుదుగా ఉంటుందని ఆయన అన్నారు.
Also Read : SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్‌గా టాలీవుడ్ హీరో!
రాజశేఖరరెడ్డికి ఉన్న దార్శనికత, ప్రజల పట్ల ప్రేమ మరింత వైఎస్ఆర్ కుమారుడిగానే కాదు ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, దార్శనికత, ప్రేమకు వారసుడు జగన్ అని కొనియాడారు. ఇటువంటి జగన్ తో కలిసి నడుస్తున్నందుకు మనం అందరం గర్వంగా చెప్పుకునే పరిస్థితి అని, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జగన్ దార్శనిక పాలనకు ఉదాహరణ అన్నారు.
జగనన్న సురక్షా క్యాంపైన్ లో భాగంగా సచివాలయ సారధులు వారం రోజుల్లోనే 60 లక్షల ఇళ్ళను సందర్శించారు. చంద్రబాబు, లోకేష్ పగటి కలలు కంటున్నారని, పాలన అధికారం కాదు బాధ్యత అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్ అని ఆయన అన్నారు.
Also Read : USA: తన రసాయన ఆయుధాలను పూర్తిగా నాశనం చేసిన అమెరికా..
క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?? అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది జగన్ నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, జగనే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి గా ఉండాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. జగన్‌కు బ్రాండ్ అంబాసిడర్లు ప్రజలేనని, సంక్షేమం వైఎస్ఆర్, జగన్ పేటెంట్ అని గర్వంగా చెప్పుకోగలం?? అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇలా ఒక్కటైనా చెప్పగలడా?? అని ఆయన ప్రశ్నించారు. నాయకుడు హృదయంతో స్పందించాలి, బ్రెయిన్ తో ఆలోచించాలన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నుంచి ఇలాంటివి ఊహించలేమని, కుట్రలు పన్ని అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండాపడ్డారు.