తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు రీఓపెన్. వేసవి సెలవులు పూర్తవడంతో స్కూళ్లు పునఃప్రారంభం. పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు. విజయవాడ: నేడు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలింపు. ఛాతీ నొప్పి సహా అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం చేరిన పీఎస్సార్. నిన్న వైద్యం చేయించుకోవడానికి పీఎస్సార్‌కి మధ్యంతర బెయిల్ ఇచ్చిన జిల్లా కోర్టు. నేడు మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు కిట్టు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ.…