ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ముంబై జట్టుకు చివరి బంతికి 5 రన్స్ కావాల్సిన సమయంలో అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా సిక్స్ కొట్టి గెలుపును అందించింది. దీంతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.