Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్‌లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే (LET) కమాండర్ సైఫుల్లా కసూరి పేరు బయటకు వచ్చింది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్‌ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా…