అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురును కేవలం క్రికెట్ బ్యాట్ కోసం నిందితుడు ప్రాణాలు తీయడంతో బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని తెలిపాడు. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని విలపించాడు.. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి…
కూకట్ పల్లిలో మైనర్ బాలిక సహస్ర హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంటిపక్కన ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి సహస్ర కంటపడడంతో, విషయం బయటకు చెబుతుందేమోనని ఆందోళన చెంది తనతో తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతులో పొడిచి అతి కిరాతకంగా అంతమొందించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని…
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి సహ్రస హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్రను చంపింది పక్కింటి పదో తరగతి బాలుడు అని తెలిపారు.
క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. కూకట్‌పల్లి సహస్ర హత్య కేసు వివరాలను శనివారం పోలీసులు వెల్లడించారు. సహస్ర ఇల్లు-నిందితుడి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్‌వోటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.