కూకట్ పల్లిలో మైనర్ బాలిక సహస్ర హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంటిపక్కన ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి సహస్ర కంటపడడంతో, విషయం బయటకు చెబుతుందేమోనని ఆందోళన చెంది తనతో తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతులో పొడిచి అతి కిరాతకంగా అంతమొందించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సహస్ర తల్లి రేణుక సంచలన కామెంట్స్ చేసింది.
Also Read:Botsa Satyanarayana : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం
తన కూతురికి జరిగినట్టుగా ఆ అబ్బాయికి జరగాలి అని డిమాండ్ చేసింది. కూతురుని కోల్పోయిన మా బాధ ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తెలియాలి.. మొబైల్ దొంగతనం చేసుకుని వచ్చినప్పుడే మందలించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. పిల్లల పెంపకంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం మేము… ఇద్దరం కష్టపడి పెంచుకుంటున్నాం.. వీడు కేవలం పాప బర్త్ డే కి మాత్రమే ఇంటికి వచ్చాడు..
Also Read:Kreative Launchpad : క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ – తెలుగు సంగీతానికి కొత్త ఊపిరి
ఈ బాబు చేసిన కిరాతకాన్ని చూసిన తరువాత మా బాబు వాణ్ణి చంపేద్దామని అంటున్నాడు.. వాడికి మేము ఏమని సమాధానం చెప్పాలి.. నా బిడ్డకు న్యాయం జరగాలి… నిందితుడిని చంపెయ్యాలి.. కఠినంగా శిక్షించాలని కోరింది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లిదండ్రులు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఆందోళనకు దిగాయి. సహస్రకి న్యాయం జరిపించాలంటూ డిమాండ్ చేశారు.