పెరుగుతున్న కొవిడ్-19 కేసులను చూస్తుంటే, పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొవిడ్ కొత్త రూపాంతరం, JN.1 కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అంతే కాకుండా చలికాలంలో ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల పండుగల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.