సైబర్ సిటీలోని యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి వెలుపల బైక్‌పై వెళ్తున్న దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు రెండు డజన్లకు పైగా బుల్లెట్లను పేల్చారు. కాల్పుల ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. సమాచారం ప్రకారం, ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఎల్విష్ ఇంటి వెలుపల కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-57లో ఉన్న ఇంటి వద్ద ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో…
Sabarimala Devotees: కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం, ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బీమా పథకం ద్వారా యాత్రికులు ప్రమాదంలో మరణించినప్పుడు వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. Also Read: CM Revanth Reddy : సీఎం రేవంత్…
Kondapochamma Sagar : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండపోచమ్మ సాగర్‌కు పర్యటనకు వెళ్లారు. అందులో కొందరు రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆ యువకులు డ్యామ్‌లోకి పడిపోయారు. అక్కడున్న స్థానికులు వారిని రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ, ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.. అయితే… మిగిలిన ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే.. తాజాగా…
ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండలంలో నివాసముంటున్న మహేందర్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు బాగానే…
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో జనం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. వీరికి ఎలక్ట్రిక్ బైక్ లు ఊరట నిస్తున్నాయి. ప్రారంభంలో ఖర్చు ఎక్కువే వున్నా.. రోజూ పెట్రోల్ బంకులకు వెళ్లే అవకాశం లేదు. ఒకసారి ఛార్జి చేస్తే వంద కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ బైక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లు అంత సేఫ్…
దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. దీపావళి టపాసులు కాల్చడం అంటే చిన్నారులకు ఎంతో సరదా. అందుకే దీపావళి రోజు టపాసులు కొనిపించాలని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మారం చేస్తుంటారు. కానీ ఈ వెలుగుల నింపే పండగలో కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. టపాసులు కాల్చే సమయంలో గాయపడటం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించే సమయంలో కొన్ని జాగ్రత్తలు…