సైబర్ సిటీలోని యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటి వెలుపల బైక్‌పై వెళ్తున్న దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు రెండు డజన్లకు పైగా బుల్లెట్లను పేల్చారు. కాల్పుల ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. సమాచారం ప్రకారం, ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఎల్విష్ ఇంటి వెలుపల కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-57లో ఉన్న ఇంటి వద్ద ఉదయం 5:30 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడు. ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ, ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు.
Also Read:Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
దనిపై ఎల్విష్ తండ్రి రామ్ అవతార్ మాట్లాడుతూ, ఎల్విష్ ప్రస్తుతం తన పనిలో బిజీగా ఉన్నాడని అన్నారు. దీని గురించి అతనితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎల్విష్ యాదవ్ ఇంట్లో కాల్పులకు భావు గ్యాంగ్ బాధ్యత వహించినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నీరజ్ ఫరీద్‌పూర్, భావు రితౌలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దాడికి బాధ్యత వహించారు. బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించడం ద్వారా అతను చాలా కుటుంబాల నాశనానికి కారణమయ్యాడని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఎల్విష్ యాదవ్ హర్యాన్వి గాయకుడు రాహుల్ ఫాజిల్‌పురియాకు సన్నిహితుడు. అందువల్ల, ఈ ఘటనను రాహుల్ ఫాజిల్‌పురియా కేసుతో ముడిపెడుతున్నారు. గత నెలలో రాహుల్ ఫాజిల్‌పురియాపై కూడా కాల్పులు జరిపిన విషయం గమనార్హం. దీనికి సునీల్ సర్ధానియా బాధ్యత వహించారు.