కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు సదాశివనగర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. సందీప్ వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల అప్పు…