S Jaishankar: భారత చరిత్రకారుడు విక్రమ్ సంపత్ రచించిన 'టిప్పు సుల్తాన్: ది సాగా ఆఫ్ ది మైసూర్ ఇంటర్‌రెగ్నమ్' పుస్తకావిష్కరణకు విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఇడియన్ హాబిటాట్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ లాగానే భారత విదేశాంగ విధానం కూడా ఉందన్నారు. పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్‌తో పోల్చారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశం అయ్యారు. పొరుగు దేశంలోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్‌తో పాటు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై రేపు (నవంబర్ 29) జైశంకర్ పార్లమెంట్‌లో వివరించనున్నారు.
S Jaishankar: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో కొనసాగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా కేంద్రమంత్రి జైశంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యితో భేటీ అయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతపై ఓ కన్నేసి ఉంచుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు.
S Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా వారి సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తారని చెప్పుకొచ్చారు.
S Jaishankar: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఎన్నికల పోటీపై స్పందిస్తూ.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ఐదు అధ్యక్షుల కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారత్-యూఎస్ సంబంధాలు మాత్రమే పెరుగుతాయని చెప్పారు.
India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు.
S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు.