S Jaishankar: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఎన్నికల పోటీపై స్పందిస్తూ.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ఐదు అధ్యక్షుల కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారత్-యూఎస్ సంబంధాలు మాత్రమే పెరుగుతాయని చెప్పారు.
India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు.
S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే వేరేలా ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం చెప్పారు.
Indian UPI In Maldives: మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయించారు. మాల్దీవుల్లో UPIని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ముయిజ్జు ఆదివారం కోరారు. ముయిజు నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ.. మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీని వల్ల ఆర్థిక చేరిక, ఆర్థిక లావాదేవీల్లో సామర్థ్యం ఇంకా డిజిటల్…
ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో సభ్యదేశాల అతిథుల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఓ విదేశాంగ…
విదేశాంగ మంత్రి జైశంకర్ డిన్నర్ చేయాల్సి వస్తే జార్జ్ సోరోస్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లలో ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నిస్తే, జైశంకర్ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Pakistan: అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (SCO-CHG) సమావేశానికి భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్‌లోని డీ-చౌక్‌లో నిరసనలకు ప్లాన్ చేశారు.
Jaishankar : చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు. చైనాతో 75 శాతం సమస్యలను పరిష్కరించుకున్నామని జైశంకర్ చెప్పారు.
ఇదిలా ఉంటే, ఐసీ 814 నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐసీ 421 విమానం హైజాక్ ఘటనని గుర్తు చేసుకున్నారు. 1984లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. స్విట్జర్లాండ్ జెనీవాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశిస్తూ జైశంకర్ మాట్లాడారు. ఐసీ 814 గురించి ఒకరు ప్రశ్నించగా, తనకు ఐసీ 421 హైజాక్‌లో జరిగిన సొంత సంఘటనని వివరించారు.