రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మోడీపై ఆయన మండిపడ్డారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఅర్ తీసుకున్న ప్రతి నిర్ణయం పేద ప్రజల కోసం ఉంటుంది. అకాల వర్షాల వలన, రైతులు నష్టపోయారు, సీఎం స్వయంగా పంట పొలాలను పరిశీలించారు. రాళ్ల వానల వలన ధాన్యం తడిసి పోయింది..నష్టపోయిన పంట పొలాలను నేను స్వయంగా పరిశీలించాను..రాష్ట్రం లో నీళ్ళు ఎక్కువగా ఉండడం వలన వరి పొలాలు సాగు చేశారు..బి అర్ ఎస్ అంటే రైతు ప్రభుత్వం.. ఇబ్బడి ముబ్బడిగా వరి సాగు చేశారు.
Read Also: The story of A Beautiful Girl: అందగత్తె ఆడియెన్స్ ముందుకొచ్చేది ఎప్పుడంటే…
రైతు బీమా, రైతు బంద్ కేసీఆర్ ఇచ్చారు.. సిరిసిల్ల జిల్లా లో 13 మండలాలలో 19 వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇది ప్రాథమిక అంచనా. 17 వేల మంది రైతులు.. హెక్టార్ 25 వేలు, ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. రాష్ట్రం లో నీ ప్రతి రైతు నమ్మకంగా ఉండాలి. సివిల్ సప్లై ద్వారా 7 1/2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం అని చెప్పారు కేటీఆర్. గత కంటే ఈసారి ఇప్పటికే ఎక్కువ కొనుగోలు చేశాము. రాష్ట్రం లో రైతులు ఆందోళన చెందవద్దు..కర్ణాటక లో ఎన్నికలు జరుగుతున్నాయి.. నరేంద్రమోడి గారు కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టో మూడు సిలిండర్ లు ఫ్రీ అంటున్నారు..నరేంద్రమోడి దేశానికి ప్రధాన లేక కర్ణాటక రాష్ట్రానికి ప్రధానమంత్రా? అదాని కొన్న ఎయిర్ పోర్ట్ కి జీఎస్టీ ఉండదు కానీ పాలు పెరుగుల పై జి ఎస్టీ వేసిన ఘనుడు నరేంద్రమోడీ అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
Read Also: The story of A Beautiful Girl: అందగత్తె ఆడియెన్స్ ముందుకొచ్చేది ఎప్పుడంటే…