ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్(భారత్ రాష్ట్ర సమితి) రైతు బంధు పథకం కింద డబ్బు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో 2023లో కూడా 2018 పునరావృతం కాగలదని ఆశించింది. ఇది ఎన్నికల ఫలితాలను నడిపిస్తుందని.. భారీగా ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్ ఆశాభావం వ్యక్తం చేసిందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Harish Rao: రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు.
రైతు బంధును అనుమతిని ఎన్నికల కమిషన్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ్ రావు స్పందించారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. ఇది ఏ పార్టీలకు సంబంధించినది కాదు అని తెలిపారు.
ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అని నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఉన్నట్టుండి రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది..
Minister KTR: రైతు బంధు కొత్త స్కీమ్ కాదు... కొనసాగుతున్న స్కీమ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కోసం నవంబర్ 29, 2013 న కేసీఅర్ ఆమరణ దీక్ష కు దిగారని గుర్తు చేశారు. కేసీఅర్ పోరాటంతో కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు.
Harish Rao: పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 24 గంటల కరెంటు, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంగా మాట్లాడుతున్నారు.. గుడుంబా ప్యాకేట్ ఇస్తే ఓటు వేస్తారని అంటున్నారు.. అవమానకరంగా అవహేళన చేస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు.
Minister KTR: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వం డబ్బు సరఫరా కొనసాగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అలాగే రైతుబంధుతో పాటు