US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్‌తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
India: రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా ఆర్మీలో పని చేస్తున్న సుమారు 25 మంది భారతీయులకు విముక్తి దొరకనుంది. వారందరినీ రిలీజ్ చేయాలని రష్యా సర్కార్ నిర్ణయించింది.
రష్యా ఆర్మీలో సహాయకులుగా రిక్రూట్ అయిన భారతీయులను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనిపై రష్యా అధికారులతో భారత్ మాట్లాడిందని, కాంట్రాక్టుపై నియమించుకున్న భారతీయులను విడుదల చేయాలని డిమాండ్ చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డిమాండ్‌తో చాలా మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగొచ్చారు.