రష్యా-ఉక్రెయిన్ వెనుక యుద్ధాలు మొదలు పెట్టిన దేశాలన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కాల్పుల విరమణతో శాంతి వాతావరణం చోటుచేసుకున్నాయి. ఇరాన్-గాజా-ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.
రష్యా ఒక చారిత్రాత్మక అడుగు వేసి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడంతో ఈ చర్య ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాలిబన్లు నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్ను అంగీకరిస్తూ రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. దీనితో, తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ అధికారంలోకి వచ్చింది. Also…
Ukraine War: రష్యా ఉక్రెయిన్పై అతిపెద్ద వైమానిక దాడి ప్రారంభించింది. ఈ దాడుల్లో ఒక ఆరుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా మొత్తం 537 వైమానిక ఆయుధాలను ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయి. అయితే, వీటిలో 249ని కూల్చేసినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామ్ చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ప్రజల ప్రాణాలకు అవసరమయ్యే అన్నింటిని రష్యా టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో ఆరోపించారు.…
India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి.
Iran Russia Meeting: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల చేసింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల తయారీకి ఇరాన్ ప్లాన్ చేస్తోందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్కు అనేక సార్లు స్పష్టం చేశామని తెలిపారు.
Russia: ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో రష్యా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదంలో యూఎస్ సైనిక జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. ‘‘ ఈ పరిస్థితిలో సైనిక జోక్యం ఉండకూడదు. ఇది నిజంగా అనూహ్యమైన, ప్రతికూల పరిణామాలతో కూడిన అత్యంత ప్రమాదకర చర్య అవుతుంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు.
Israel Iran War: ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఈ రెండు దేశాలు గత 6 రోజులుగా వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడుల తర్వాత ‘‘ప్రపంచం విపత్తుకు మిల్లీ మీటర్ల దూరంలో ఉంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శాంతి చర్చలు ప్రారంభించారు.