ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా పైకి క్షిపణులు ప్రయోగించడానికి తమ మిత్ర దేశాలు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. రష్యాకు మద్దతుగా మోహరించిన నార్త్ కొరియా సేనలను ధీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులే ప్రయోగించాలన్నారు.
Zelensky: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా నార్త్ కొరియా రష్యాకు భారీగా సైనికులను తరలిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా బలగాలు మాస్కో్కి చేరడంపై చైనా మౌనం వహించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు.
India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్‌కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంతా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్‌పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.
Cyber Attack On Russia: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అధికారిక వెబ్సైట్, మౌలిక సదుపాయాలపై బుధవారం నాడు ఉదయం వివిధ విదేశాల నుంచి భారీ సైబర్ ఎటాక్ ప్రారంభమైంది.…
ప్రధాని మోడీ రష్యా పర్యటన ముగిసింది. బ్రిక్స్ సదస్సు కోసం రెండ్రోజుల పర్యటన కోసం మోడీ రష్యా వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో మోడీ పాల్గొని దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Modi Xi Jinping: దాదాపుగా 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తొలిసారి సమావేశమయ్యారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ మీటింగ్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం ప్రారంభమైంది. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు పెద్దగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టిపెట్టలేదు. తాజాగా బ్రిక్స్ ఇరు దేశాధినేతల భేటీకి వేదికగా మారింది. Read Also: KTR: నాంపల్లి కోర్టులో పరువునష్టం దావాపై కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డ్.. గల్వాన్…
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు.
ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసి పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ సమావేశాన్ని పుతిన్ విజయవంతంగా నిర్వహించారంటూ కొనియాడారు.
PM Modi- Xi Jinping: బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమ్మిట్ కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు.