రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీన్ని భారత విదేశాంగ శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను తక్షణమే విడుదల చేయాలని రష్యాను భారత్ కోరింది.
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను కలవాలని అనుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ ఇద్దరి మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతానని పలుమార్లు ట్రంప్ అన్నారు.
Zelensky: గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్(59) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Pakistan: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుగాంచిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చేరింది. రొటేషన్ పద్ధతిలో పాక్ కు ఈ ఛాన్స్ వచ్చింది.
నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు షాకిచ్చాయి. ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న గ్యాస్ రవాణాను జనవరి 1న న్యూఇయర్ సమయంలో అనూహ్యంగా నిలిపేసింది. దీంతో ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక సిరియా అధ్యక్షుడు అసద్.. రష్యాకు రాజకీయ శరణార్థిగా వెళ్లిపోయారు. డమాస్కస్‌ను రెబల్స్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
Plane Crash: కజకిస్తాన్‌లో అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.
China–Russia: గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ వెల్లడించారు.
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ భార్య అస్మా మరణపు అంచుల్లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తీవ్రమైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.