Plane Crash: అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలిపోవడంతో 38 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో పలు కుట్రకోణాలు బయటకు వస్తున్నాయి.
సిరియాలో అధికారం కోల్పోయిన అసద్ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. ఈ తరుణంలో అస్మా భర్త నుంచి విడాకులు కోరుతూ రష్యా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
Zelenskyy: రష్యా తరఫున తమపై యుద్ధం చేస్తూ మరణించిన నార్త్ కొరియా సైనికుల ముఖాలను గుర్తు పట్టకుండా రష్యా కాల్చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించాడు.
Russia: పలు సంస్థలపై రష్యా ఉగ్రవాద ముద్ర వేసింది. ఈ క్రమంలో వాటికి ఆ ముద్ర నుంచి రిలీఫ్ కల్పించేందుకు మాస్కో రెడీ అవుతుంది. అందులో భాగంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Bashar al-Assad: సిరియాలో బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 5 దశాబ్ధాలుగా ఆ దేశంలో అస్సాద్ కుటుంబ పాలన ముగిసింది. ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) తిరుగుబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇదిలా ఉంటే, బషర్ ఫ్యామిలీలో సహా అతను కూడా రష్యాకు పారిపోయాడు. ఇన్నాళ్లు బషర్కి అండగా ఉన్న ఇరాన్, రష్యాలు తిరుగుబాటుదారుల ముందు తలవంచాయి.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
Bashar al-Assad: తిరుగుబాటుతో సిరియా రెబల్స్ హస్తగతమైంది. ఇప్పటికే ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్స్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఏళ్లుగా సిరియాను పాలిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగిసింది.