Russia Ukraine War : రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య పదినెలలుగా యుద్ధం నడుస్తోంది. రష్యా దాడులకి ఉక్రెయిన్ దేశం భారీగా నష్టపోయింది. దాదాపు తుడిచిపెట్టుకు పోయిందని చెప్పుకోవాలి.
Crude Oil : ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత, ప్రపంచంలోని అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీన్ని ఎదుర్కోవడానికి, రష్యా తన మిత్రదేశాలకు తగ్గింపు ధరలకు ముడి చమురును సరఫరా చేయడానికి ముందుకొచ్చింది.
Russian Leader Daughter Killed By Car Bomb: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, కీలక నేత అయి అలెగ్జాండర్ డుగిన్ కుమార్తెను దారుణంగా హత్య చేశారు. కారులో బాంబ్ పెట్టి హతమర్చారు. అయితే మెయిన్ టార్గెట్ అలెగ్జాండరే అని తెలుస్తోంది. అలెగ్జాండర్ కుమార్తె డారియా దుగినా కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో మాస్కోకు వెలుపల 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోల్షి వైజ్యోమీ గ్రామ సమీపంలో టయోటా ల్యాండ్ క్రూజర్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.…
Nancy Pelosi Taiwan Visit: అమెరికా ప్రతినిధుల సభ్య స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన అమెరికా, చైనాల మధ్య అగ్గిరాజేసింది. పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిప్పులో చెలగాటమాడుతున్నారని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండా బుధవారం నాన్సీ పెలోసీ తైవాన్ ను సందర్శించారు. ఇదిలా ఉంటే ఆమె పర్యటనపై రష్యా స్పందించింది. పెలోసీ పర్యటన ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని.
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ప్రారంభమై మూడు నెలలు గడిచాయి. ఇప్పటికే ఈ రెండు దేశాలు తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలు, గ్రామాలు ధ్వంసం అవుతున్నాయి. అయినా ఇప్పట్లో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఉక్రెయిన్ లో 20 శాతం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. యుద్ధం…
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ లోని నగరాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధం ఇవాళ్టికి 17వ రోజుకు చేరుకుంది. రష్యా మాత్రం తన పట్టువీడడం లేదు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాంబుదాడులతో పలు నగరాలకు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచి వలస పోతున్నారు. 10 లక్షలమంది వరకూ వలస వెళ్ళి వుంటారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ లోని అనేక నగరాలు రష్యా సైన్యం అధీనంలోకి వెళ్లినట్టు…