Putin: డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ‘‘దోస్తీ’’ గురించి మాట్లాడుతూనే, యూరప్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ దిగుమతులను పెంచడం గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని పుతిన్ చెప్పారు. భారత్, చైనాతో సహా కీలక భాగస్వాములతో రష్యా ఆర్థిక సంబంధాలు మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. VTB ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Putin- Modi Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా, ట్రంప్ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలకు మద్దతుగా నిలిచారు. ఈ రెండు దేశాలను యూఎస్ ఆంక్షల పేరుతో బెదిరించలేదని అన్నారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ అనంతరం మీడియాతో మాట్లాడిన పుతిన్..
గత వారం చైనాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారు ప్రయాణం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పెద్దపెద్ద సదస్సుల్లో దేశాధినేతలు వేర్వేరు కార్ల కాన్వాయ్‌ల్లో వేదికల వద్దకు చేరుకొంటారు. కానీ, తింజియన్‌లోని షాంఘై సహకార సదస్సులో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో బయల్దేరి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఇద్దరూ దాదాపు 45 నిమిషాలు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కానీ..…
India Stops Buying Russian Oil: అగ్రరాజ్యం సుంకాల ఒత్తిడికి భారతదేశం తలొగ్గి, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేస్తే తర్వాత పరిస్థితి ఏంటదనే.. ప్రస్తుతం ఎంతో మంది మదిలే మెదిలే ప్రశ్న. మాస్కో నుంచి అత్యధికంగా భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న సాకు చూపెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై 50% సుంకాలు విధించారు. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చాలా…
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే…
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుతిన్, ఇతర దేశాలతో సంబంధాల గురించి ఈ వీడియో సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా-భారత్ మధ్య సంబంధాలు నిరంతరం అన్ని దిశల్లో అభివృద్ధి చెందుతున్నాయని, దీనికి గ్యారెంటీ ప్రధాని నరేంద్రమోడీ విధానమే అని పుతిన్ అన్నారు.
Putin: వెస్ట్రన్ దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫైర్ అయ్యారు. భారత్, రష్యా బంధాన్ని పశ్చిమ దేశాలు విడదీయలేవని ఆయన అన్నారు. భారతదేశం తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని, దీనివల్ల పాశ్చాత్య దేశాల ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు. సోచి నగరంలో రష్యాన్ బ్లాక్ సీ రిసార్టులో జరిగి ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.