ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం రష్యా జరిపిన క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 18 క్షిపణులను కూల్చివేశాయని ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. యూఎస్ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్‌తో అర డజను రష్యన్ హైపర్‌సోనిక్ క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన�
రష్యా దాడులు శుక్రవారం ఉక్రెయిన్ అంతటా నగరాలను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారు. మాస్కో దళాలపై ఎదురుదాడికి కీవ్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులక�
ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ విరుచుకుపడింది. దాదాపు 81 క్షిపణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది.
దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్‌పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం పలు పేలుళ్లు సంభవించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని నెలల విరామం తర్వాత కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరగగా.. పొగలు కమ్ముకున్నాయి.