రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో నోవాటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
విశాఖపట్టణం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించేందుకు వెళ్లనున్నారు.
వివాదాస్పద రుషికొండ నిర్మాణాలపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టూరిజం ప్రాజెక్ట్ కోసం ఖరీదైన విల్లాలు తప్ప ప్రచారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నివాస భవనాల స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. అయితే, పర్యావరణంకు జరుగుతున్న హాని మాత్రం క్షమించరానిది అన్న నారాయణ.. మంత్రులు, సలహాదారులపైన ఫైర్ అయ్యారు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప నిజాలు ప్రజలకు తెలియకుండా చూడడం సరైన విధానం కాదన్నారు.. ఆగస్టులో…
విశాఖ సాగర తీరం తిరుమల వేంకటేశ్వర స్వామి నామస్మరణతో మరింతగా పులకించనుంది. భక్త కోటి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 23 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విషయం తెలిసి భక్తులు ఆనందపరవశులవుతున్నారు. ఆధ్యాత్మిక శోభతో విశాఖ సాగరతీరం మరింత కమనీయంగా మారనుంది. సుప్రభాతం సేవతో మొదలుకొని..పవళింపు సేవ వరకు వెంకటేశ్వరుడి నామస్మరణతో విశాఖ నగరం పులకించనుంది. ఋషికొండ సమీపంలో తిరుమల…
విశాఖ రుషికొండపై టీటీడీ నిర్మించిన ఈ ఆలయం ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం.. ఇవన్నీ చూస్తే మరో తిరుమలలా అనిపిస్తుంది. భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని కొండపై 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించింది టీటీడీ. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల నిమిత్తం సుమారు 28 కోట్లు నిధులు ఖర్చు చేసింది. ఇప్పుడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అచ్చం తిరుమల ఆలయం మాదిరే.. విశాఖలోనూ వేంకటేశ్వరుడి…