Vostro Accounts ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ఒకటి.. వోస్ట్రో అకౌంట్లు. వీటినే.. స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్లు.. SRVA.. అని కూడా అంటారు. ఇతర దేశాలతో చేసే ఎగుమతులు, దిగుమతులకు పేమెంట్లను రూపాయల్లో నిర్వహించటానికి ఇండియా ఈ సరికొత్త ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భారతదేశం ప్రారంభించిన ఈ నూతన విధానం పట్ల పలు దేశాలు కూడా ఉత్సాహం కనబరుస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
Today (16-02-23) Business Headlines: ఏప్రిల్ 1 నుంచే ఐటీఆర్‌లు: ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే దాఖలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ మొదటి రోజు నుంచే ఐటీఆర్ ఫారాలు అందుబాటులో ఉంటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. పోయినేడాది ఐటీఆర్ ఫారాలతో పోల్చితే వీటిలో పెద్దగా మార్పులు లేవని పేర్కొంది. కాబట్టి ఐటీఆర్‌లను దాఖలుచేయటం ఇక తేలికని వెల్లడించింది.