Ashish Vidyarthi: బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పోకిరి సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా ఆశిష్ ఎంత ఫేమస్ అయ్యాడో.. 57 ఏళ్ళ వయస్సులో రెండో పెళ్లి చేసుకొని అంతకన్నా ఎక్కువ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే ఆయన అస్సాంకు చెందిన రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.