ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్‌లో క్లౌడ్ బరస్ట్ అయిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. శిథిలాలు ప్రవహించే ప్రాంతాలను మూసేశామని.. దీని కారణంగా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని చెప్పారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు. అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ.. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో…
Rudraprayag: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని పలు గ్రామాల్లో హిందువులు కానివారి ప్రవేశాన్ని నిషేధిస్తూ పోస్టర్లు వెలిశాయి. నాన్-హిందువులు, రోహింగ్యా ముస్లింల ప్రవేశాన్ని నిషేధించారు.
Helicopter Crash: కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండింగ్ టైంలో దెబ్బతింది. దీనిని తరలించేందుకు సైన్యం ఎంట్రీ ఇచ్చింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ను రప్పించారు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను కట్టి ఇవాళ ఉదయం తరలించారు.
Rudraprayag : ప్రతేడాది జూన్‌లో కేదార్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. భక్తుల రద్దీని బట్టి ధామ్‌లో ఒక గంటలో 1800 మందికి పైగా భక్తులకు కమిటీ దర్శనం కల్పిస్తుంది.
ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Kedarnath Yatra: దేశంలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఢిల్లీ-ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఉత్తరాఖండ్‌కు కూడా చేరుకున్నాయి.
Uttarakhand Cracks : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పట్టణం జోషిమఠ్‌లో ఇప్పటికే దాదాపు 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్‌లోని ఇళ్లలో కూడా ఇలాంటి పగుళ్లు కనిపించాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గంలో టన్నెల్ నిర్మాణమే ఈ పగుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు.