Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
RTA Raids: రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడో రోజు రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్- ఆరంఘర్ చౌరస్తా దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారుల కొరడా ఝలిపిస్తున్నారు.
నాపరాతిని తమకున్న ఆర్డర్ల కోసం వివిధ ప్రాంతాలకు లారీలలో, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కానీ వాటిని తరలింపు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాపరాతి బండలను లారీలలో, ట్రాక్టర్లలో బాడీ లెవెల్ వరకు నింపకుండా.. అధిక లోడ్డుతో వెహికిల్స్ లో నింపుకొని రోడ్లపైకి రావడం వల్ల.. వెనక వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేస్తున్నారు.
JC Prabhakar Reddy: జేసీ ట్రావెల్స్‌పై పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తప్పుడు సమాచారం ఇచ్చి, ఫోర్జరీలకు పాల్పడ్డారని.. రవాణా శాఖ ఫోర్జరీ సంతకాలు, దొంగ స్టాంపులు, నకిలీ పత్రాలతో అధికారులను మోసం చేస్తూ అక్రమాలకూ పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసులు పెట్టారు.. తాజాగా మరో వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది.. అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. నకిలీ ఇన్సూరెన్స్…